రోడ్డు పక్కన చెత్త ఏరుకునే వ్యక్తికి కనిపించిందో పాలిథిన్ కవర్ మూట.. లోపల ఏముందా అన్న ఆశతో మూటను విప్పి చూస్తే..

ABN , First Publish Date - 2022-07-25T21:14:08+05:30 IST

అహ్మదాబాద్‌లోని వస్నా ప్రాంతంలో రోడ్డుపై చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తికి ఓ పెద్ద పాలిథిన్ కవర్ మూట కనిపించింది..

రోడ్డు పక్కన చెత్త ఏరుకునే వ్యక్తికి కనిపించిందో పాలిథిన్ కవర్ మూట.. లోపల ఏముందా అన్న ఆశతో మూటను విప్పి చూస్తే..

అహ్మదాబాద్‌ (Ahmedabad) లోని వస్నా ప్రాంతంలో రోడ్డుపై చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తికి ఓ పెద్ద పాలిథిన్ కవర్ మూట కనిపించింది.. లోపల ఏముందో చూద్దామని ఆ వ్యక్తి ఆ మూటను తెరిచి చూసి షాకైపోయాడు.. లోపల కాళ్లు, చేతులు, తల లేని మొండం కనిపించింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.. మరో మూడ్రోజుల తర్వాత మరోచోట కాళ్లు, చేతులు కనిపించాయి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు కనుగొన్నారు.. 




సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు ఆ మృతదేహం స్వయం జోషి అనే యువకుడిదని తేల్చారు. కన్నతండ్రే ఆ యువకుడిని హత్య చేశాడని కొనుగొన్నారు. శనివారం సాయంత్రం నీలేష్ జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత గురువారం రాత్రి తన కొడుకును తానే హత్య చేశానని పోలీసుల ఎదుట నీలేష్ అంగీకరించాడు. తన కొడుకు మద్యానికి బానిసయ్యాడని, రోజూ తాగి తనతో గొడవపడేవాడని చెప్పాడు. చెయ్యి కూడా చేసుకునేవాడని, దీంతో విసిగిపోయి నిద్రిస్తున్న కొడుకును హత్య చేశానని తెలిపాడు. మొదట పదునైన ఆయుధంతో హతమార్చి, ఆపై తల, చేతులు, కాళ్లను శరీరం నుంచి వేరు చేశానని చెప్పాడు. 


పాలిథిన్ కవర్ దొరికిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఓ వృద్ధుడు స్కూటర్‌పై వచ్చినట్టు తెలిసింది. ఆ స్కూటర్ నెంబర్ ఆధారంగా నీలేష్ అడ్రస్‌ను పోలీసులు తెలుసుకున్నారు. అతని ఇంటికి వెళ్లి చూడగా లోపల రక్తం మరకలు కనిపించాయి. నీలేష్ ఆచూకీ మాత్రం దొరకలేదు. పోలీసులు అతని మొబైల్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా రాజస్థాన్‌లో ఉన్నట్టు తేలింది. దీంతో గుజరాత్ పోలీసులు రాజస్థాన్ పోలీసులను సంప్రదించి శనివారం సాయంత్రం నీలేష్‌ను అరెస్టు చేశారు. విచారణలో, తానే తన కొడుకును హత్య చేసినట్టు నీలేష్ ఒప్పుకున్నాడు.


Updated Date - 2022-07-25T21:14:08+05:30 IST