Abn logo
Oct 23 2020 @ 00:46AM

రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ కొత్త సీరీస్‌ విడుదల

న్యూఢిల్లీ : కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పారిశ్రామిక కార్మికుల రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ కొత్త సీరీ స్‌ను విడుదల చేశారు. దీనికి బేస్‌ సంవత్సరాన్ని 2016గా సవరించారు. గత సీరీ్‌సలో ఇది 2001గా ఉండేది. దేశంలో ద్రవ్యోల్బణ ధోరణులు తెలుసుకోవడానికి వినియోగదారుల ధరల సూచీ-పారిశ్రామిక కార్మికులు విశ్వసనీయంగా పరిగణిస్తారు. ప్రారంభంలో దీన్ని కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామిక కార్మికులకు డీఏ నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకునే వారు. తాజాగా దాన్ని కనీస వేతనాల నిర్ణయానికి కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవ ధరల స్థితికి దర్పణం పట్టేలా చూసేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ బేస్‌ సంవత్సరాన్ని మారుస్తారని గంగ్వార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement