Abn logo
Apr 13 2021 @ 15:38PM

రిటైల్ ద్రవ్యోల్భణం 5.52 శాతానికి పెరుగుదల...

న్యూఢిల్లీ : వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్భణం మరోసారి పెరిగింది. మార్చి నెలకు సంబంధించి సీపీఐ 5.52 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి నెలలో నమోదైన 5.03 శాతం కంటే ఇది 0.49 శాతం అధికం. ఈ మేరకు కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్భణం అధికంగా ఉన్న నేపధ్యంలో... సీపీఐ ద్రవ్యోల్భణం అంతకుముందు నెల కంటే ఎక్కువగా నమోదయినట్లు ఎన్‌ఎస్‌ఓ  అభిప్రాయపడింది.


ఆహార ద్రవ్యోల్భణం ఫిబ్రవరిలో 3.87 శాతంగా ఉండగా, మార్చిలో 4.94 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 4.83 శాతం, తృణధాన్యాలు 0.69 శాతం తగ్గాయి. నూనె ధరలు అధికంగా 20.78 శాతం నుండి 24.92 శాతం పెరగడం గమనార్హం. మాంసం, చేపలు15.09 శాతం, పప్పు దినుసులు 13.25 శాతం, గుడ్లు 10.6 శాతం, పండ్లు 7.86 శాతం, పాల ఉత్పత్తులు 2.24 శాతం మేర పెరిగాయి.


నూనె సహా ధరల మంట... 5.52 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్భణం...

దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది నెలల్లో రూ. 130 నుండి రూ. 170 కి పెరిగినవి కూడా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్భణం ఎగసిపడుతుండడంతో ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది.

Advertisement
Advertisement
Advertisement