నేతన్నకు చేయూత పథకం పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-06-15T06:19:13+05:30 IST

రాష్ట్రంలోని నేత కార్మికులకు చేయూ తగా నిలిచిన పొదుపు పథకం ‘నేత న్నకు చేయూత’ ను పునః ప్రారంభిస్తున్నామని, చేనేత, మరమగ్గాల కార్మికులు పొదుపు పథకంలో చేరాలని చేనేత జౌళి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

నేతన్నకు చేయూత పథకం పునఃప్రారంభం
బతుకమ్మ చీరలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

- కరోనా కాలంలో రూ.103 కోట్ల లబ్ధి 

- గడువుకు ముందే  నిధులు పొందే వెసులుబాటు 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి   కే తారకరామారావు 

- బతుకమ్మ చీరల తయారీపై సమీక్ష


సిరిసిల్ల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నేత కార్మికులకు చేయూ తగా నిలిచిన పొదుపు పథకం ‘నేత న్నకు చేయూత’ ను పునః ప్రారంభిస్తున్నామని, చేనేత, మరమగ్గాల కార్మికులు పొదుపు పథకంలో చేరాలని చేనేత జౌళి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం హైద రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో టెక్స్‌టైల్‌ శాఖ అధి కారులు, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉత్పత్తి అవుతున్న కోటి బతుకమ్మ చీరలపై చర్చించారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పథకంలో చేరిన కార్మికులు పొదుపు చేసుకున్న దానికి ఆదనంగా ప్రభుత్వం తన వాటాను జమ చేస్తుందన్నారు. చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు, రెట్టింపు వాటా 16 శాతం, మరమగ్గాల కార్మికులు 8 శాతం వాటా జమ చేస్తే, దానికి సమానంగా 8 శాతం వాటాను ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. పథకం ద్వారా రాష్ట్రంలో 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్‌లూం కార్మికులకు భరోసా కలుగుతుందన్నారు. తెలంగాణ రాకముందు కేవలం చేనేత కార్మికులకే ఈ పథకం ఉండేదని, దీనిని పవర్‌లూం కార్మికులకు కూడా వర్తింప జేస్తున్నామని తెలిపారు. గతంలో  సొసైటీ పరి ధిలో ఉండే కార్మికులకు మాత్రమే వర్తించేదని, ఇప్పుడు కార్మికులతోపాటు అనుబంధ కార్మికులు కూడా చేరవచ్చని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వం రెట్టింపు వాటాను అం దిస్తోందన్నారు. ఈ పథకం  కరోనా కాలంలో నేతన్నలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  కరో నా పరిస్థితుల నేపథ్యంలో లాకింగ్‌ పీరియడ్‌ కన్నా ముందే ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. దీని ద్వారా రూ.103 కోట్లు ప్రయోజనం కలిగిందన్నారు. ఇలాంటి ప్రయోజనక రమైన  పధకాన్ని కొనసాగించాలని నేత కార్మికులు కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంద న్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, నేత కార్మికులం దరూ ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకంలో చేరాలని అన్నారు. 

బతుకమ్మ చీరల పరిశీలన 

సిరిసిల్ల మరమగ్గాలపై ఉత్పత్తి అవు తున్న బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.  ఈ సారి బతుకమ్మ చీరల తయారీలో డాబీ, జాకార్డ్‌ డిజైన్లను తీసుకు రావడంతో కార్మికులకు ఉత్పత్తి తగ్గి వేతనాలు తగ్గిపోయాయని సిరిసిల్ల వస్త్రోత్పత్తి దారులు మం త్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న చీరల్లో మార్పులు చేసి ఉత్పత్తిని పెంచుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు.  సమావేశంలో టెక్స్‌టైల్‌ శాఖ కమిష నర్‌ శైలజరామయ్యార్‌, సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు చీటి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పట్టణ అద్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, వస్త్రోత్పత్తి దారులు దూడం శంకర్‌, గోవిందు రవి, భాస్కర్‌, మండల సత్యం, మంచె శ్రీనివాస్‌, మ్యాక్స్‌  సొసైటీల ప్రతినిధులు చిమ్మని ప్రకాష్‌, యెల్దండి శంకర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-06-15T06:19:13+05:30 IST