ఈసీఐ వెబ్‌సైట్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ABN , First Publish Date - 2021-05-02T01:22:18+05:30 IST

పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి..

ఈసీఐ వెబ్‌సైట్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల (2021) కౌంటింగ్‌ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్, ట్రెండ్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వెబ్‌సైట్‌కు యూజర్లు లాగాన్ కావాల్సి ఉంటుంది. రిజల్ట్ ట్రెండ్స్‌ను 8 గంటల నుంచే వెబ్‌సైట్, యాప్‌లో ఈసీఐ మొదలుపెడుతుంది. మల్టీ-డైమన్షనల్ అనాలసిస్ కూడా ఉంటుంది. దాదాపు ఎన్నికల ఫలితాలన్నీ ట్రెండ్స్‌‌కు దగ్గరగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.




వెబ్‌సైట్ కోసం ఇలా...

-ఇసీఈ అధికారిక వెబ్‌సైట్: https://results.eci.gov.in/.

-వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయగానే 'జనరల్ అసెంబ్లీ ఎనలక్షన్ 2021' రిజల్ట్ అని కనిపిస్తుంది.

-కొత్త విండో ప్రత్యక్షమవుతుంది.

-స్క్రీన్‌ మీద మీరు ప్రిఫర్ చేసే రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం డిస్‌ప్లే అవుతుంది.


ఈసీ యాప్‌లో ఫలితాలను చెక్ చేసుకునేందుకు...

-గూగుల్ ప్లే స్టోర్‌ను కానీ యాపిల్ యాప్ స్టోర్‌ను కానీ ఉపయోగించుకుని ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

-రిజిస్ట్రేషన్ కోసం మీ క్రెడెన్సియల్స్ సమర్పించాలి.

-ఆ తర్వాత హోం పేజీలోని రిజల్ట్ ఆప్షన్‌‌ను ఉపయోగించుకుని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తెలుసుకోవచ్చు.

-వివిధ న్యూస్ ఛానెల్స్‌ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్స్, ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

Updated Date - 2021-05-02T01:22:18+05:30 IST