Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 05 Jul 2022 13:33:52 IST

RRR: ’ గే లవ్‌ స్టోరి.. రసూల్‌ పోకుట్టి వ్యాఖ్యలు viral!

twitter-iconwatsapp-iconfb-icon

ఎన్టీఆర్‌(Ntr), రామ్‌చరణ్‌(Ramcharan) కీలక పాత్రధారులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli)తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఘన విజయాన్ని అందించారు. 1200 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. అయితే సినిమాను ప్రశంసించేవారితోపాటు విమర్శించే వారూ ఉన్నారు. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. తాజాగా ఓ ఇద్దరు నెటిజన్లు ఈ చిత్రాన్ని తక్కువ చేసి మాట్లాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒక గే లవ్‌ స్టోరీ (RRR gay love story) అని కామెంట్‌ చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ సౌండ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ రసూల్‌ పోకుట్టి కూడా చేరారు. ఎవరో ఇద్దరు నెటిజన్లు చేసిన కామెంట్‌కు సపోర్ట్‌ చేస్తూ... రసూల్‌ కూడా ఈ చిత్రాన్ని ‘గే లవ్‌ స్టోరీ’గా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. (RRR gay love story said Resul Pookutty)


మొదట దర్శకుడు మునీష్‌ భరద్వాజ్‌ ‘‘ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ అనే ఒక చెత్త సినిమాను చూశాను’’ అంటూ ట్వీట్‌ చేశారు. దానికి సపోర్ట్‌గా ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది ఒక గే లవ్‌ స్టోరీ’’ అని రసూల్‌ రీట్వీట్‌ చేశాడు. కథానాయికలుగా ఆలియాభట్‌, శ్రియా శరణ్‌లను బొమ్మలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం కనిపించలేదు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్‌ విజేత అందుకొని భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన ఓ వ్యక్తి, ఇలాంటి చీప్‌ కామెంట్స్‌ చేయడం కరెక్టేనా అంటూ నెటిజన్లు రసూల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అయినప్పటికీ తన వ్యాఖ్యల్ని రసూల్‌  సమర్థించుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ‘‘మీరు చేసిన కామెంట్‌తో మీపై గౌరవం పోయింది’’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేేస్త.. ‘‘వెస్ట్రన్‌ దేశాల్లో ఆ చిత్రాన్ని అలానే పిలుస్తున్నారు. అదే నేను ట్వీట్‌ చేశాను’’ అని సమర్ధించుకున్నారు రసూల్‌ పోకుట్టి. 

RRR:  గే లవ్‌ స్టోరి.. రసూల్‌ పోకుట్టి వ్యాఖ్యలు viral!

ఈ విషయంపై ‘బాహుబలి’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విట్టర్‌ వేదికగా రసూల్‌ పోకూట్టికి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మీరు అనుకుంటున్నట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గే లవ్‌ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. అయితే మాత్రం తప్పేంటి? ‘గే లవ్‌ స్టోరీ అయితే అదేమైనా చెడ్డ విషయమా? అలాగని మీరెలా జస్టిఫై చేస్తారు. ఎంతో ఘనత సాధించిన మీరు ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం నిరాశకు గురి చేసింది’’ అని శోభు ట్వీట్‌ చేశారు. దానికి కూడా రసూల్‌ రిప్లై ఇచ్చారు. ‘‘ఒకవేళ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గే లవ్‌ స్టోరీ అయినా తప్పేం లేదు. నేను  నా ఫ్రెండ్‌కి సమాధానం ఇచ్చాను. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న చర్చ గురించి మాట్లాడాను. ఇందులో దిగజారడం ఏమీ లేదు. నువ్వు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు శోభు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అని శోభు ట్వీట్‌కు రసూల్‌. (Shobhu Fire on Resul Pookutty)



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement