‘ఉపాధి’ పై ఆంక్షలు

ABN , First Publish Date - 2022-08-20T05:35:15+05:30 IST

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం తాజాగా ఆంక్షలు అమలు చేస్తుం డడంతో కూలీలు దిగులు చెందుతున్నారు.

‘ఉపాధి’ పై ఆంక్షలు

- ఒక్కో పంచాయతీలో ఏడాదికి 20 పనులకే పరిమితం

- రిజిష్టర్‌లో ఉదయం..సాయంత్రం కూలీల సంతకం

- తాజాగా బ్యాంక్‌ ఖాతా వివరాలు

జగిత్యాల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం తాజాగా ఆంక్షలు అమలు చేస్తుం డడంతో కూలీలు దిగులు చెందుతున్నారు. ఉపాధి పనుల నిర్వహణపై పలు మార్పులు చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక గ్రామంలో యేడాదిలో ఇరవైకి మించి పనులు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలు గతంలో ఇచ్చిన జీరో బ్యాంకు ఖాతాలు చెల్లవని కొత్తగా బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ మళ్లీ ఖాతా తెరవాలని సూ చించింది. ఇక కూలీలు పని చేసిన రోజు ఉదయం, సాయంత్రం రిజిష్టర్‌ లో సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నెల ఒకటవవ తేదీ నుంచి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసు కొచ్చింది. 

రెండు సార్లు కూలీల సంతకం..

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉపాధి పథ కంలో కూలీలు పని చేసే చోట రోజుకు రెండు సార్లు పనిచేసే ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. ఉదయం 9 గంటల లోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి రిజిస్టర్‌లో ప్రతీ కూలీ సంతకం చేయాలి. రెండు సంతకాలు ఉంటేనే కొత్త నిబంధ నల ప్రకారం రోజు కూలీ రూ. 257 లభించనుంది.

కొన్ని పనులకు మినహాయింపు...

ఉపాధి హామీ పథకంలో కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల ఒకటవ తేదీ నుంచి కొత్త నిబంధనలు పకడ్బందీగా అమలు చే స్తున్నారు. ప్రతీ గ్రామానికి 20 పనుల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొన్ని పనులకు నిబంధనల నుంచి మినహాయింపు కల్పించారు. ఇందులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడాన్ని మినహాయించారు. ఉపా ధిహామీ ద్వారా గ్రామాల్లో చేపట్టే డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక, ఇం కుడు గుంతలు, గొర్రెల, బర్రెల షెడ్లు, కల్లాలు, కిచెన్‌ షెడ్లు వంటి పలు రకాల అభివృద్ధి పనుల సంఖ్య 20కి మించితే అనుమతి లభించదు. దీనికి గాను ఉపాధిహామీ పథకం సాఫ్ట్‌ వేర్‌ మస్టర్‌ యాప్‌లో మార్పులు చేశారు. అలాగే గ్రామానికి 20 పనులకు మించి చేయాలంటే కలెక్టర్‌ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో పనులు చేపట్టాల్సి ఉం టుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు క్షేత్ర స్థా యిలో ఉన్న పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, అధికార యం త్రాంగం కృషి చేయాలి. గతంలో గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా పలు రకాల పనులు పెద్ద ఎత్తున చేపట్టడంతో ఎక్కువ మంది కూలీలకు ప నులు దొరికేవి. ప్రస్తుతం కొత్త నిబంధనతో ఆశించిన మేర పనులు దొరకవని కూలీలు ఆవేదన చెందుతున్నారు. 

పనులకు కేంద్రం ఆమోదం తప్పనిసరి...

కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో గుర్తించిన పనులకు మండలం, జిల్లా అధికారులు అనుమతు లు తీసుకోవాలి. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరిగా తీ సుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చే వరకు పను లను ప్రారంభించడానికి వీలులేదు. 

కొత్తగా బ్యాంక్‌ అకౌంట్‌లు..

గతంలో ఉన్న అకౌంట్‌లకు బదులుగా ప్రస్తుతం కొత్తగా బ్యాంకు అ కౌంట్‌లు తెరవాల్సి ఉంటుంది. కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచి ఆ వివ రాలను అధికారులు అందించాల్సి ఉంటుంది. మరోవైపు కొత్త ఖాతాలను తెరవడానికి కనీస బ్యాలెన్స్‌ రూ. వెయ్యి ఉండడంతో ఆర్థిక ఇక్కట్లకు గురికావాల్సి వస్తోంది. 

20 పనులు పూర్తయ్యాకే కొత్త పనులు..

కేంద్రం అమల్లోకి తీసుకొస్తున్న నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతీ గ్రామ పంచాయతీలో 20 పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యాకే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన కమిటీ ఆమోదంతో కొత్త పనులు చేపట్టాలన్న మార్గదర్శకాలు వచ్చా యి. కొత్త నిబంధనలపై కూలీలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. 

పకడ్బందీగా అమలు

- వినోద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఉపాధి హామీ పథకంపై కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకా ల ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మారిన నిబంధనలపై ఈజీఎస్‌ కూ లీలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈనెల ఒకటవ తేది నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.


Updated Date - 2022-08-20T05:35:15+05:30 IST