గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు?: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-09-06T20:03:04+05:30 IST

గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు

గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు?: చంద్రబాబు

విజయవాడ: గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్థాయని నిలదీశారు. తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు న్యాయం కోసం ఈనెల 9న నర్సరావుపేటలో నిరసన తెలుపుతామని ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే 175 నియోజకవర్గాల్లో ఈనెల 10న చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం తీశారు. జగన్‌రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మద్య నిషేధంపై మహిళలతో కలిసి ఉద్యమించాలని తీర్మానించామని ప్రకటించారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా జగన్‌రెడ్డి ప్రజలను భ్రమింపజేశారని, దిశ చట్టం ఎక్కడ ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-06T20:03:04+05:30 IST