Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాలిగౌరారం సూర్య దేవాలయాన్ని పునరుద్ధరించండి

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక సూర్య దేవాలయాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో గల సూర్య దేవాలయం శిథిలావస్థకు చేరిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆలయాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను ఎంపీ కోమటిరెడ్డి కోరారు. ఈ దేవాల‌యానికి పున‌ర్‌వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు కృషిచేయాల‌ని కోరారు.  త‌క్ష‌ణ‌మే ఆల‌య పున‌ర్నిర్మాణం జ‌రిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వ‌ర‌గా పున‌ర్ నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యేలా చూడాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.


శాలిగౌరారం మండలంలో 14 వ శతాబ్దంలో నిర్మించబడిన "సూర్య దేవాలయం" ఉంది.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement