మనఊరు, మనబడితో పునరుద్ధరణ పనులు

ABN , First Publish Date - 2022-08-19T04:50:05+05:30 IST

మన ఊరు, మన బడి కింద జిల్లాలోని 183 పాఠశాలల్లో పునరుద్ధరణ పనులు జరుగు తున్నాయని, ప్రతీ విద్యార్థి ప్రై వేటు పాఠశాలలకు ధీటుగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలలతో పాటు, గురు కులాలను ఏర్పాటుచేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మనఊరు, మనబడితో పునరుద్ధరణ పనులు
నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

- కేజీబీవీలో జూనియర్‌ కళాశాల తరగతి గదులు  ప్రారంభం 


గోపాల్‌పేట, ఆగస్టు 18 :  మన ఊరు, మన బడి కింద జిల్లాలోని 183 పాఠశాలల్లో పునరుద్ధరణ పనులు జరుగు తున్నాయని, ప్రతీ విద్యార్థి ప్రై వేటు పాఠశాలలకు ధీటుగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలలతో పాటు, గురు కులాలను ఏర్పాటుచేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువా రం గోపాల్‌పేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీలో రూ.2 కోట్ల 5లక్షలతో నూతన జూని యర్‌ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి సాగునీరు రావడంతో ప్రజలంతా వ్యవసాయ పనుల్లో నిమ గ్నమైయ్యారన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నా యంగా ఇతర అధిక ఆదాయం ఇచ్చే పంటలపై శిక్షణ ఇచ్చేందుకు త్వరలో రైతుసదస్సు నిర్వహి స్తామన్నారు. అనంతరం స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మండల స్థాయి ఆటల పోటీలను  ప్రారంభించారు. ఆ తర్వాత రూ.75లక్షలతో సామూహిక భవన నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. తాడిపర్తి గ్రామంలో రూ.57.90 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బుద్దారం గం డిలో నూతనంగా ఏర్పాటుచేసిన 52 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూ జలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ సభ్యురాలు భార్గవి, సర్పంచ్‌ శ్రీనివాసు లు, ఎంపీటీసీ సభ్యురాలు కేతమ్మ, కోఆప్షన్‌ స భ్యుడు మతిన్‌, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ దీప్తి, ప్రమీల, అనురాధ, డీఈఈ శ్రీనివాసులు, ఈఈ రాం చందర్‌, కాంట్రాక్టర్‌ నాగరాజు, నాయకులు బాల రాజు, వడ్డెగోపాల్‌, మన్నెంనాయక్‌, నాగరాజు త దితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T04:50:05+05:30 IST