గుడుగుంట్లపాలెంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కొత్త తీగలను వేస్తున్న విద్యుత్ అధికారి
మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో తెగిన వైర్లను విద్యుత్ అధికారులు శుక్రవారం పునరుద్దరించారు. నెల రోజుల క్రితం వచ్చిన గాలి, వానకు 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడినా అధికారులు పట్టించుకోకపోవడంతో ‘విద్యుత్ వైర్లు తెగిపడినా పట్టించుకోరా? శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను పునరుద్ధరించారు. దీంతో గ్రామస్థులు అనందం వ్యక్తం చేశారు.
- పాలకవీడు