వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన అధికారులు

ABN , First Publish Date - 2020-11-28T05:12:37+05:30 IST

ఒక రాత్రంతా చుట్టూ వరదనీటిలో బస్సులో కూర్చోని బిక్కుబిక్కుమంటూ గడిపిన 45మంది ప్రయాణికులను అధికారులు, రెస్క్యూటీం సభ్యులు సురక్షిత ప్రాంతాలను శుక్రవారం తరలించారు.

వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన అధికారులు
వరదలో చిక్కుకున్న ప్రయాణికులను తరలిస్తున్న రెస్క్యూటీం సభ్యులు

గూడూరు(రూరల్‌), నవంబరు 27: ఒక రాత్రంతా చుట్టూ వరదనీటిలో బస్సులో కూర్చోని బిక్కుబిక్కుమంటూ గడిపిన 45మంది ప్రయాణికులను అధికారులు, రెస్క్యూటీం సభ్యులు సురక్షిత ప్రాంతాలను శుక్రవారం తరలించారు. తిప్పవరప్పాడు సమీపంలో రాపూరుకు వెళ్లే బస్సు వరదనీటిలో చిక్కుకుంది. వరద ఉధృతం కావడంతో రాత్రి సహాయక చర్యలు నిలిపివేసిన అధికారులు శుక్రవారం వేకువన  ట్రాక్టర్ల ద్వారా ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. తాళ్లమ్మగుడి సమీపంలోని ఇటుక బట్టీల వద్ద వరదనీరు చేరడంతో బట్టీలలో పనిచేసే కూలీలను తహసీల్దారు లీలారాణి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. మధురెడ్డికాలనీ వాసులను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Updated Date - 2020-11-28T05:12:37+05:30 IST