బాధ్యతగా మొక్కల సంరక్షణ

ABN , First Publish Date - 2022-07-06T04:57:21+05:30 IST

మొక్కల సంరక్షణను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

బాధ్యతగా మొక్కల సంరక్షణ
‘మన ఊరు - మన బడి’ పనులపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- అధికారులకు కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశం

- మానవపాడు, ఇటిక్యాల, ఉండవల్లి మండలాల్లో పర్యటన

- హరితహారం పనుల పరిశీలన

మానవపాడు, జూలై 5 : మొక్కల సంరక్షణను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండలంలోని మానవపాడు స్టేజీ వద్ద జాతీయరహదారికి ఇరువైపుల నాటిన మొక్క లను మంగళవారం ఆయన పరిశీలించారు. మొక్క లకు ట్రీగార్డులను అమర్చి, ఊతకర్రలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చ రించారు. ఆ తర్వాత అమరవాయి, చెన్నిపాడులలోని పాఠశాలల్లో కొనసాగుతున్న ‘మన ఊరు- మన బడి’ పనులను ఆయన పరిశీలించారు. పనులను నాణ్య తతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రా క్టర్లకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో రమణారావు, పంచాయతీరాజ్‌ డీఈ ఆంజనేయులు, ఏఈ నరేంద్ర, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


నాటే ప్రతీ మొక్క బతకాలి

అలంపూర్‌ చౌరస్తా : గ్రామాల్లో నాటే ప్రతీ మొక్క బ్రతకాలని కలెక్టర్‌ శ్రీహర్ష అదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి మండలంలోని ఇటిక్యాలపాడు శివారులో 44వ జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే పనులను మంగళ వారం ఆయన పరిశీలించారు. పనులను పర్యవేక్షి స్తున్న ఎంపీడీవో అంజనేయరెడ్డి, పంచాయతీ కార్య దర్శి రవికుమార్‌గౌడులతో మాట్లాడారు. నాటిన చెట్లకు కంచెలను ఏర్పాటు చేసి, సక్రమంగా నీటిని అందించాలని ఆదేశించారు. 


సకాలంలో పనులు పూర్తి చేయాలి

ఎర్రవల్లి చౌరస్తా : మన ఊరు - మన బడి పనులను వేగవంతంగా, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని ప్రభుత్వ పాఠశాల, కొండేరు ప్రభుత్వ పాఠశాలలను సోమవారం ఆయన పరిశీలించారు. పనులను పూర్తి చేసి పాఠశాలలను అకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని, పనులను త్వరగా మొదలు పెట్టాలని ఎర్రవల్లి సర్పంచ్‌ రవికి సూచించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ప్రధానోపాధ్యా యుడు శ్రీధర్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామసర్పంచు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, తాను కూడా ఒకరిని నియమిస్తానని కలెక్టర్‌ తెలిపారు. కొండేరులో పాఠశాల పనులను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచు ఈరన్నకు సూచించారు. అనంతరం 44వ జాతీయరహదారి వెంట నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. మొక్కల మధ్య ఖాళీ లేకుండా నాటించి, సంరక్షించాలని ఎంపీడీవో రాఘవకు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీవో భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T04:57:21+05:30 IST