Abn logo
Sep 20 2021 @ 23:54PM

బాధ్యతలు స్వీకరించిన డీఈవో

కర్నూలు(ఎడ్యుకేషన), సెప్టెంబరు 20: జిల్లా విద్యాశాఖ అధికారిగా వి.రంగారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న డీఈవో సాయిరాం బదిలీపై వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ స్థానంలో రాయచోటి డైట్‌ కళాశాలలో పని చేస్తున్న వి.రంగారెడ్డిని ప్రభుత్వం నియమించింది. డీఈవో రంగారెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకాష్‌రెడ్డి, మీనాక్షి, సామేల్‌పాల్‌, బేగ్‌, జిల్లా విద్యాశాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వేల్పనూరు బలరామిరెడ్డి, ఆప్టా నాయకులు మునగాల మధుసూదన రెడ్డి, రమావత సేవానాయక్‌, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.