జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-03-07T22:27:12+05:30 IST

జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గల్లీ నుంచి హస్తిన వరకు సత్తాచాటిన

జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా: కేటీఆర్‌

హైదరాబాద్‌: జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గల్లీ నుంచి హస్తిన వరకు సత్తాచాటిన జర్నలిస్టులకు రుణపడి ఉంటామన్నారు. ఆదివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘జర్నలిస్టులు ప్రశ్నించాల్సిందే.. మేము వారికి చేయాల్సిందే. మరణించిన 260మంది జర్నలిస్టు కుటుంబాలకు లక్ష చొప్పున సహాయం చేసాం. వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివిస్తాం. బీజేపీ పాలిత గుజరాత్ లో కేవలం వెయ్యి అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి. ఏదో చేసినట్లు ఆ పార్టీ ఎగిరెగిరి పడుతోంది. తెలంగాణ రాకముందు మాటల్తోటే సీఎం కేసీఆర్ చీల్చి చెండాడారు. కేసీఆర్‌ను బట్టేబాజ్ అనడానికి ఎన్నిగుండెలు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా మీద మేము మాట్లాడలేమా. మేము మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేరు బిడ్డ. నాకు, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ సహా మా నేతలకు కేసీఆర్ ట్రైనింగ్ ఉంది. మేము కూడా తిట్టగలం. తెలంగాణ రాకపోతే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఆస్థిత్వమే లేదు. బీజేపీ ఎంపీలు ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-03-07T22:27:12+05:30 IST