ప్రజల సమస్యల పరిష్కారానికే స్పందన

ABN , First Publish Date - 2022-06-26T06:06:48+05:30 IST

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బం దులను తొలగించడానికే స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికే స్పందన
అధికారులకు కలెక్టర్‌ సూచనప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ బసంతకుమార్‌


 అందులో విఫలం కాకూడదు

బత్తలపల్లి, జూన25: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బం దులను తొలగించడానికే స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు.  కావున ప్రజా సమస్యలను పరిష్క రించడంలో అధికారులు విఫలం కాకూడదని సూచిం చారు. మండల కేంద్రమైన బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్‌ నిర్వహిం చారు. ఈ సందర్బంగా 93ఆర్జీలు స్వీకరించారు. ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించి 41,  రెవెన్యూ 36, ఎంపీడీఓ 3, హౌసింగ్‌ 2, పోలీస్‌ 2, వైద్యఆరోగ్యశాఖ, గనులశాఖ, ఐసీడీఎస్‌, వాటర్‌షెడ్‌, ఐకేపీ, పంచా యతీరాజ్‌కు సంబం ధించి ఒక్కొక్కటి చొప్పున అందాయి. అలాగే తాడిమర్రిమండలం నుంచి 2ఆర్జీలు, ముదిగుబ్బ మండలం నుంచి ఒక అర్జీ అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిపై ఉందన్నారు. పంటబీమా పరిహారం విషయంలో అధికంగా అర్జీలు అందాయన్నారు. ఆర్జీదారుల సమస్యలను నిర్ణతగడువులోగా పరిష్కారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. మండలస్థాయి సమస్యలు తిరిగి ఉన్నతాధికారుల దృష్టికి పోకుండా పరిష్కారించాలని తెలిపారు. పంటబీమా పరిహారంలో ఎవరి వైౖనా తప్పులు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. బత్తలపల్లి మండలానికి వేరుశనగ పంటబీమా రాలేదని, ఇనపుట్‌సబ్సిడీ అయినా ఇచ్చి ఇక్కడి రైతులను ఆదుకోవాలని టీడీపీ, వైసీపీ నాయకులు  వేర్వేరుగా వెళ్లి ఆర్జీలు ఇచ్చారు. 

మండలంలో 

కలెక్టర్‌ విస్తృత పర్యటన

మండలకేంద్రంలోని సచివాల యం--2, ఆర్‌బీకే కేంద్రాలను కలెక్టర్‌ బసంతకుమార్‌ అకస్మికతనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ప్రతి సచివాలయానికి 560ఆనలైన సేవలున్నాయని, వాటి లో కనీసం 50సేవలైన అందించాలన్నారు. అనంతరం ఆర్‌బీకే--1లో రికార్డులను పరిశీలించి అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడారు. వేసిన పంట ఒకటైతే మరోపంటకు ఈ క్రాప్‌ చేయించుకోవడం వల్ల రైతులందరూ చాలా నష్టపోయారని తెలిపారు. బత్తలపల్లి మండలంలో వర్షం బాగా వచ్చినందున  పంటల బీమా రాలేదని  తెలిపారు.  అదే విధంగా జగనన్న లేఅవుట్‌లో పూర్థిస్థాయిలో నిర్మాణాలు చేపట్టక పోవ డానికి కారణాలను తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్‌, హౌసింగ్‌పీడీ చంద్రమౌళి, జిల్లా వ్యవసాయాధికారి శివన్నారా యణ, సివిల్‌సప్లై అధికారి వంశీకృష్ణారెడ్డి,  ఎంపీడీఓ విజయ్‌భాస్కర్‌, ఏఓ పెన్న య్య, ఏఈ రమణయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వరలక్ష్మి, పశు వైద్యాధికారి గురునాథరెడ్డి, ఎంపీపీ గుర్రం వనజాశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T06:06:48+05:30 IST