Abn logo
Sep 27 2021 @ 00:10AM

మెగా జాబ్‌మేళాకు స్పందన

ఆర్డర్‌ కాపీలు అందజేస్తున్న సీడాప్‌ చైర్మన్‌ శ్యాంప్రసాద్‌రెడ్డిఇచ్ఛాపురం:ఇచ్ఛాపురంలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ సొసైటీ ఫర్‌ ఎంప్లాయీమెంట్‌  అండ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌(సిడాప్‌) నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు స్పందన లభించిందని  సీడాప్‌  చైర్మన్‌ సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గ స్థాయిలో డీఆర్‌డీఏ,  సిడాప్‌ ద్వారా 20 కంపెనీలు ఇంట ర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ  భారీ వర్షా నికి లెక్కచేయకుండా మేళాకు 1,365 మంది యువత  హాజరయ్యారని తెలిపారు.  486 మందికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ వెలుగు జేడీఎం సీహెచ్‌ రామ్మోహన్‌రావు, ఎంపీపీ దేవాదాసురెడ్డి, నాయ కులు సీహెచ్‌ తులసీదాస్‌రెడ్డి, తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు,  ఎస్‌.ప్రసాద్‌రావు, బి.సూర్యారావు, బి.మల్లేశ్వరరావు, వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లు పాల్గొన్నారు.