Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పందన అర్జీలను పరిష్కరించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 6 : స్పందనలో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో లేకుండా అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారంవివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు పలురకాల సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై స్పందించిన కలెక్టర్‌ వివిధ సమస్యల కోసం వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. సచివాలయాలలో గడువు తీరిన అర్జీలు ఉండరాదని తెలిపారు. జేసీ టీఎస్‌ చేతన్‌ మాట్లాడుతూ అధికారుల నిర్లిప్తత కారణంగా కొన్ని అర్జీలు గడువులోగా పరిష్కారం కావడంలేదన్నారు. మీసేవ పోర్టర్‌ ద్వారా వచ్చిన అర్జీలలో 1117 పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయ సిబ్బంది ప్రొబిషనరీ డిక్లరేషన్‌పై ఈనెల 15వతేదీలోపు నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీలు జే వెంకట మురళీ, కేఎ్‌సవిశ్వనాఽథన్‌, డీఆర్వో పులి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  కాగా శ్మశానవాటికకురక్షణ కల్పించాలని కొండపి మండలం ఇలవర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు కోటేశ్వరరావు,శ్యామ్‌, శ్రీదేవిలు కోరారు. ఎన్‌ఎ్‌సపీ కాలువద్వారా పంట పొలాలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొరిశపాడుకుచెందిన రైతులు కలెక్టర్‌ను కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరు చేసిన యూనిట్లను విడుదల చేయించాలని మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఎస్టీలు కోరారు. ప్రభుత్వం పెట్టిన ఓన్‌టైమ్‌ సెటిల్‌మెట్‌ పథకం కింద గ్రామసచివాలయం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకొనేందుకు పట్టాలేనందున ఒంగోలు తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా పొజిషన్‌ సర్టిఫికేట్‌ ఇప్పించాలని ఒంగోలు కేశవరాజుకుంటకు చెందిన షేక్‌ కాలేషావలి కోరారు. 


Advertisement
Advertisement