Abn logo
Sep 16 2021 @ 19:52PM

మోదీ అవినీతిపరుడు కాదు: మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తనకు అపార గౌరవం ఉందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు ఇరా బసు అన్నారు. ఆయన అవినీతికి పాల్పడతారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రధాని మంచి పనులు చేస్తున్నారని కితాబిచ్చారు. రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఆయన బాగానే పనిచేస్తున్నారని, మరీ ముఖ్యంగా రైల్వేల విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. 


నచ్చిన రాజకీయ నేతలు ఎవరన్న ప్రశ్నకు ఇరా బసు బదులిస్తూ బుద్ధదేవ్ భట్టాచార్య, కాంగ్రెస్ నేత బిదాన్ చంద్ర రాయ్ పేర్లను చెప్పారు. మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇరాబసు ఇటీవల బారాబజార్ ప్రాంతంలోని డన్‌లప్ వీధుల్లో బిచ్చగత్తెలా కనిపించడం ఒక్కసారి వైరల్ అయింది. స్థానికులు ఆమెను గుర్తించడంతో ఆమె ఎవరన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్స అందించడంతో తిరిగి మామూలు మనిషి అయ్యారు. 

ఇవి కూడా చదవండిImage Caption