పునరావాసం కల్పించాలని తీర్మానపత్రం అందజేత

ABN , First Publish Date - 2022-05-27T06:44:51+05:30 IST

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్ల గూడెం ముంపునకు గురవుతున్నందున గ్రామ నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయంలో పునరావాసం కోసం తీర్మానపత్రాన్ని గురువారం అందజేశారు.

పునరావాసం కల్పించాలని తీర్మానపత్రం అందజేత
ఆర్డీవో కార్యాలయంలో తీర్మానపత్రం అందజేస్తున్న నిర్వాసితులు

మర్రిగూడ, మే 26: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్ల గూడెం ముంపునకు గురవుతున్నందున గ్రామ నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయంలో పునరావాసం కోసం తీర్మానపత్రాన్ని గురువారం అందజేశారు. డిండి నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తు న్నందున చర్లగూడెం ముంపు గ్రామ నిర్వాసితులు చింతపల్లి మం డలం మధనాపురం గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మాన పత్రాన్ని ఆర్డీవో కార్యాలయ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో రాంకోటి, బండ నర్సింహ, కొత్త రవి, ఎల్లయ్య, యాదయ్య పాల్గొన్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వాసితులు చేస్తున్న ధర్నా గురువారం 16వ రోజుకు చేరింది. తెలంగాణ జనసమితి పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి పల్లె వినయ్‌ కుమార్‌ ధర్నాకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. డిండి లిప్టు ఇరిగేషన్‌ పథకంలో గృహాలు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కోసం ఈ నెల 17న నల్లగొండలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ను కలిసినట్లు తెలిపారు. స్పందించిన కలెక్టర్‌ ఈ నెల 21న నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందిస్తామని చెప్పారని ఇంతవరకు అమలు కాలేదన్నారు. చర్లగూడెం నిర్వాసితులకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-27T06:44:51+05:30 IST