ప్లాస్టిక్‌ నిషేధంపై గ్రామసభల్లో తీర్మానం

ABN , First Publish Date - 2022-07-02T06:19:37+05:30 IST

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల తలెత్తే అనర్థాలను వివరిస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ శర్మ, డాక్టర్‌ రామకోటేశ్వరరావు, మున్సిపల్‌ సిబ్బంది, వార్డు సచివాలయం సిబ్బంది శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ప్లాస్టిక్‌ నిషేధంపై గ్రామసభల్లో  తీర్మానం
తిరువూరులో అవగాహన ర్యాలీ

తిరువూరు, జూలై 1: ప్లాస్టిక్‌ వినియోగం వల్ల తలెత్తే అనర్థాలను వివరిస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ శర్మ, డాక్టర్‌ రామకోటేశ్వరరావు, మున్సిపల్‌ సిబ్బంది, వార్డు సచివాలయం సిబ్బంది శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయిస్తే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని పంచాయతీల్లో  ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీర్మానం చేశారు. ్ల ఈవోఆర్డీ వెంకటరత్నం,  సర్పంచ్‌లు, కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:19:37+05:30 IST