లోక్‌అదాలత్‌లో 4445 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T07:01:09+05:30 IST

చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన లోక్‌అదాలత్‌లో 4445 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు.

లోక్‌అదాలత్‌లో 4445 కేసుల పరిష్కారం
కేసులు పరిష్కరిస్తున్న న్యాయమూర్తులు

చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన లోక్‌అదాలత్‌లో 4445 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. తిరుపతిలో 1397, చిత్తూరులో 549, మదనపల్లెలో 495, పుత్తూరులో 365, పుంగనూరులో 328, నగరిలో 234, కుప్పంలో 207, తంబళ్లపల్లెలో 177, పలమనేరులో 169, శ్రీకాళహస్తిలో 139, పాకాలలో 134, సత్యవేడులో 83, పీలేరులో 26 కేసులు చొప్పున.. వీటితోపాటు పీఎల్‌పీ కేసులు 152 ఉన్నాయి. చిత్తూరు కోర్టు ఆవరణంలో ఉదయం జరిగిన లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో జిల్లా జడ్జి భీమారావు మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజ మార్గమని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఏ బంధానికైనా నమ్మకమే ప్రధానమని పేర్కొన్నారు. చిన్న చిన్న గొడవలను ఓర్పుతో పరిష్కరించుకోవాలని కోరారు. గతంలో చిన్న చిన్న సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించుకునేవారని ఎస్పీ రిశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. చిన్న సమస్యలను సర్దుబాటుతో పరిష్కరించుకోవడం ద్వారా న్యాయస్థానాలు పెద్ద కేసుల పరిష్కారంపై శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రోప్‌ స్వచ్చంద సంస్థ సహకారంతో మునిసిపల్‌ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డీఎల్‌ఎస్సీ సెక్రటరీ కరుణకుమార్‌, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, శాంతి, శ్రీనివాసులు, ఏఎస్పీ జగదీష్‌, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

- చిత్తూరు, లీగల్‌




Updated Date - 2022-06-27T07:01:09+05:30 IST