నిరోధ స్థాయిలు 17350, 17500

ABN , First Publish Date - 2022-08-01T07:14:08+05:30 IST

నిఫ్టీ గత వారం కరెక్షన్‌ ట్రెండ్‌లోనే ప్రారంభమైనా కీలక స్థాయి 16500 వద్ద బౌన్స్‌బ్యాక్‌ సాధించి బలమైన ర్యాలీతో 17000 స్థాయిని కూడా ఛేదించింది.

నిరోధ స్థాయిలు 17350, 17500

సోమవారం స్థాయిలు

నిరోధం : 17260, 17350

మద్దతు : 17080, 17000


నిఫ్టీ గత వారం కరెక్షన్‌ ట్రెండ్‌లోనే ప్రారంభమైనా కీలక స్థాయి 16500 వద్ద బౌన్స్‌బ్యాక్‌ సాధించి బలమైన ర్యాలీతో 17000 స్థాయిని కూడా ఛేదించింది. చివరికి వారం గరిష్ఠ స్థాయి 17150 వద్ద ముగిసింది. గత కొద్ది వారాల్లో కనిష్ఠ స్థాయి 15200 వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో 2000 పాయింట్ల వరకు లాభపడింది. నెలవారీ చార్టుల ప్రకారం జూలై నెల లో టెక్నికల్‌ రివర్సల్‌ సాధించి నెల మొత్తం మీద 9 శాతం లాలభపడింది. టెక్నికల్‌గా పాజిటివ్‌ ట్రెండ్‌ ఏర్పడినప్పటికీ స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి ఏర్పడినందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు గరిష్ఠ స్థాయిల్లో పొజిషన్లు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే మానసిక అవధి 17000 దాటినందు వల్ల పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు కూడా ఆస్కారం ఉంది. 


బుల్లిష్‌ స్థాయిలు: తదుపరి మైనర్‌ నిరోధాలు 17260, 17350. ఇక్కడ కన్సాలిడేషన్‌ ఉండవచ్చు. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిల్లో నిలదొక్కుకోవాలి. ప్రధాన స్వల్పకాలిక నిరో ధం 17500.

బేరిష్‌ స్థాయిలు: కరెక్షన్‌లో పడినా సానుకూలత కోసం 17000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 16750, 16500. 

బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచీ గత వారం ర్యాలీలో 750 పాయింట్లు లాభపడి 37500 వద్ద ముగిసింది. గత ఆరు నెలలుగా 38000 వద్ద బలమైన నిరోధం ఎదురవుతోంది. ఇక్కడ జరిగిన మూడు ప్రయత్నాల్లో కూడా విఫలమయింది. ఈ స్థాయిలో నిలదొక్కుకోవడం తప్పనిసరి. విఫలమైతే 37000 వద్ద గట్టి మద్దతు ఉంది.

పాటర్న్‌: మరింత స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 17500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి. మార్కెట్‌ 200 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇక్కడ నిలదొక్కుకోడం తప్పనిసరి. 17000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు. 

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు. 

Updated Date - 2022-08-01T07:14:08+05:30 IST