నిరోధ స్థాయిలు 18440, 18550

ABN , First Publish Date - 2021-10-18T07:43:08+05:30 IST

నిఫ్టీ గత వారం 18000 వరకు వెళ్లి స్వల్ప కరెక్షన్‌ సాధించినా వెనువెంటనే కోలుకుని వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. ఇప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిల్లో ఉంది. ...

నిరోధ స్థాయిలు 18440, 18550

నిఫ్టీ గత వారం 18000 వరకు వెళ్లి స్వల్ప కరెక్షన్‌ సాధించినా వెనువెంటనే కోలుకుని వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. ఇప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిల్లో ఉంది. ప్రస్తుత బుల్‌ మార్కెట్‌లో స్వల్ప రియాక్షన్లను కూడా తట్టుకుని అధిగమిస్తూ కొత్త గరిష్ఠ స్థాయిలో నమోదు చేస్తోంది. 15600 వద్ద ప్రారంభమైన గత 11 వారాల ర్యాలీలో 2800 పాయింట్ల మేరకు లాభపడింది. మూడు వారాల పాటు ప్రయత్నించిన అనంతరం 18000 స్థాయిని ఛేదించినందు వల్ల టెక్నికల్‌గా పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉంది. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. ఏ పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌ ఏర్పడినా ర్యాలీ నిలబెట్టుకోవాలంటే 18000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 18440 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మానసిక అవధి 18550. ఇక్కడ స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ ఉండవచ్చు. ఆ పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది.


బేరిష్‌ స్థాయిలు: మద్దతు స్థాయి 18150 కన్నా దిగజారితే మరో మద్దతు స్థాయి 17900. ప్రస్తుత అప్‌ట్రెండ్‌లో భద్రత కోసం ఇక్కడ రికవరీ సాధించడం లేదా బలంగా కన్సాలిడేట్‌ కావడం తప్పనిసరి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ 38000 వద్ద బ్రేకౌట్‌ సాధించడమే కాకుండా గత రికార్డులన్నీ చెరిపేసి 1550 పాయింట్ల లాభంతో 39000 కన్నా పైన కొత్త గరిష్ఠ స్థాయిల్లో క్లోజయింది. మద్దతు స్థాయి 37000. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి.

పాటర్న్‌: నిఫ్టీకి 18500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఉంది. మార్కెట్‌ మరోసారి ఓవర్‌బాట్‌ స్థితిలోకి ప్రవేశించింది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఏటవాలుగా ఎగువకు కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా చాలా పైన ఉంది. 17900 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే అప్రమత్తం కావాలి. 

టైమ్‌: గత మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 18440, 18490

మద్దతు : 18300, 18240

Updated Date - 2021-10-18T07:43:08+05:30 IST