నెల గ డువు కోరిన వాజ్‌పేయి నగర్‌ వాసులు

ABN , First Publish Date - 2022-08-13T05:15:17+05:30 IST

పట్టాభూములు ఆక్రమించి 30 ఏళ్ళ కిందట గృహాలు నిర్మించుకున్న వాజ్‌పేయి నగర్‌వాసులు ఆగస్టు 23 నాటికి ఖాళీ చేయలేమని మరో నెల గడువు ఇవ్వాలని ఆర్‌డీఓ శ్రీనివాసులును కోరారు.

నెల గ డువు కోరిన వాజ్‌పేయి నగర్‌ వాసులు
వాజ్‌పేయి నగర్‌వాసులతో మాట్లాడుతున్న ఆర్‌డీఓ

కోర్టు పరిధిలో వుందన్న ఆర్‌డీఓ శ్రీనివాసులు

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 12: పట్టాభూములు ఆక్రమించి 30 ఏళ్ళ కిందట గృహాలు నిర్మించుకున్న వాజ్‌పేయి నగర్‌వాసులు ఆగస్టు 23 నాటికి ఖాళీ చేయలేమని మరో నెల గడువు ఇవ్వాలని ఆర్‌డీఓ శ్రీనివాసులును కోరారు. శుక్రవారం తహసీల్దారు కార్యాలయం లో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొర్రెశ్రీనివాసులు నేతృత్వంలో ఆర్‌డీఓను కలిసిన వాజ్‌పేయి నగర్‌ వాసులు మాట్లాడుతూ తమకు మరో నెలరోజులు గడువు ఇవ్వాలని కోరగా అది తమ పరిధిలో లేదని కోర్టు పరిధిలో వుందని ఏమున్నా హైకోర్టు ఇవ్వాల్సిందేనని ఆర్‌డీఓ స్పష్టం చేశారు.

బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని బీజేపీ నేత శ్రీనివాసులు ఆర్డీఓకు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నుంచి వత్తిడి తెప్పించైనా కలెక్టర్‌ ద్వారానెలరోజులు గడువును కోరే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తమకు ఇంటి స్థలాలు ఎక్కడ ఇస్తారో తెలిపితే స్థలాలు చూస్తామని వాజ్‌పేయ్‌ నగర్‌వాసులు తెలిపారు. సమావేశంలో తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ డీటీ మనోహర్‌ రెడ్డి,ఆర్‌ఐలు సుదర్శన్‌ ,సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:15:17+05:30 IST