Abn logo
May 20 2020 @ 18:13PM

ఆకాశం నుంచి కరోనా వడగళ్లు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

Kaakateeya

మెక్సికో: ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మయమైపోయింది. కరోనా ప్రస్తావన లేని ఉదంతం ఉండట్లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా మెక్సీకో దేశంలోని  మాంటోమొరోలెస్ మున్సిపాలిటీలో కరోనా వైరస్ రూపంలో ఉన్న వడగళ్లు పడటం అక్కడి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అచ్చు కరోనా వైరస్‌ను పోలి ఉన్న ఆ వడగళ్లను చూసి ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే.. ఇదంతా భగవంతుడి లీల అని నమ్ముతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఇదంతా సాధారణమేనని చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో కొన్ని సార్టు.. గాల్లో ఉండగానే వడగళ్లు ఒకదానితో మరొకటి ఢీకొని ఇటువంటి ఆకృతులు పొందుతాయని వారు చెబుతున్నారు. అయితే మెక్సీకోనే కాకుండా అనేక దేశాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. మెక్సీకోలో కరోనా కేసులు సంఖ్య 54 వేలు దాటిపోయింది. అక్కడ ఒక్కరోజులు అత్యధికంగా 2713 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Advertisement
Advertisement