Happy Birthday Chor: దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తికి షాకింగ్ సర్‌ప్రైజ్.. అతడి చేత కేక్ కట్ చేయించి..

ABN , First Publish Date - 2022-06-29T22:58:22+05:30 IST

సాధారణంగా దొంగలు మీ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తారా? పోలీసులను పిలుస్తారు లేదా మీరే స్వయంగా వాడికి దేహశుద్ధి చేస్తారు.

Happy Birthday Chor: దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తికి షాకింగ్ సర్‌ప్రైజ్.. అతడి చేత కేక్ కట్ చేయించి..

సాధారణంగా దొంగలు మీ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తారు? పోలీసులను పిలుస్తారు లేదా మీరే స్వయంగా వారికి దేహశుద్ధి చేస్తారు. కానీ న్యూఢిల్లీలోని కొంతమంది నివాసితులు మాత్రం దొంగకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో చొరబడిన దొంగ బర్త్ డే అని తెలుసుకుని అతడి చేత కేక్ కట్ చేయించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. తాజాగా కొందరు నెటిజన్లు ఆ వీడియోను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

మార్కెట్‌కు వెళ్లిన తల్లి.. ఇంట్లో తండ్రి నిద్రపోతున్న సమయం చూసి ఆ 16 ఏళ్ల కూతురి నిర్వాకమిది.. ఆ తండ్రి నిద్రలేచి చూస్తే..



న్యూఢిల్లీలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఒక ఫ్లాట్‌లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ ముగ్గురినీ పట్టుకోవడానికి వారి వెంట పరుగెత్తారు. అయితే వారిలో ఇద్దరు పారిపోయారు. ఒక వ్యక్తి దొరికిపోయాడు. అతడిని పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ యువకుడు ఏడవడం ప్రారంభించాడు. ఆ రోజు తన జన్మదినోత్సవం అని, తనను వదిలేయాలని వేడుకున్నాడు. దీంతో వారికి జాలి కలిగింది. 


కేక్ తెప్పించి తమ కాలనీలోనే ఆ యువకుడి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. అతడి చేత కేక్ కట్ చేయించారు. కేక్ కటింగ్ అయిన అనంతరం ఆ యువకుడిని పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 



Updated Date - 2022-06-29T22:58:22+05:30 IST