హోంశాఖ మీడియా విభాగంలో భారీగా మార్పులు...

ABN , First Publish Date - 2020-06-06T01:53:03+05:30 IST

వారం రోజుల క్రితం హోంశాఖ అధికారిక ఫేస్‌బుక్‌లో బీర్ బాటిళ్లు, మిక్సర్ పొట్లాలు దర్శనమివ్వడంతో కేంద్ర హోంశాఖ అలర్టయ్యింది.

హోంశాఖ మీడియా విభాగంలో భారీగా మార్పులు...

న్యూఢిల్లీ : వారం రోజుల క్రితం హోంశాఖ అధికారిక ఫేస్‌బుక్‌లో బీర్ బాటిళ్లు, మిక్సర్ పొట్లాలు దర్శనమివ్వడంతో కేంద్ర హోంశాఖ అలర్టయ్యింది. మీడియా విభాగంలో భారీ ఎత్తున అధికారులను తొలగించింది. కొత్త వారికి బాధ్యతలు అప్పజెప్పింది. అయితే జూనియర్ ఉద్యోగి ఆ పోస్టును అనుకోకుండా పోస్ట్ చేశారు. దీంతో పాటు పౌరసత్వ సవరణ బిల్లు పత్రాలు కూడా దాని నుంచి మిస్సయ్యాయి. ఈరెండు సంఘటనలతో అప్రమత్తమైన హోంశాఖ... వెంటనే అధికారుల బృందాన్ని మార్చేసి... కొత్త అధికారులకు బాధ్యతలు అప్పజెప్పింది.


అంతేకాకుండా ఆ మీడియా బృందంలోని కొందరు సభ్యులకు మీడియాతో కూడా సరిగ్గా పొసగలేదని హోంశాఖ ఉన్నతాధికారులు గ్రహించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల తలెత్తిన పరిణామాలపై కూడా హోంశాఖ తీవ్ర అసంతృప్తితో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇకపై మీడియా వ్యవహారాలన్నింటినీ జనరల్ బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ నితిన్ వాకన్‌కర్ చేతుల్లోకి వెళ్లిపోనుంది. 

Updated Date - 2020-06-06T01:53:03+05:30 IST