చౌకదుకాణాల్లో రేషన్‌

ABN , First Publish Date - 2021-02-23T05:44:00+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ పథకం ప్రారంభం తరువాత మినీట్రక్కుల వారు ఇష్టమొచ్చినట్లు వాహనాలను ఎక్కడంటే అక్కడ ఆపి సరుకులు పంపిణీ చేస్తుండటంతో చాలామంది కార్డుదారులు సరకులను తీసుకోలేక పోయారు.

చౌకదుకాణాల్లో రేషన్‌

సచివాలయాల వద్ద కూడా...

డోర్‌ డెలివరీ అందని వారికి వెసులుబాటు

నెలాఖరు వరకు సరకుల పంపిణీ


నెల్లూరు(హరనాథపురం), ఫిబ్రవరి 22 : ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ పథకం ప్రారంభం తరువాత మినీట్రక్కుల వారు ఇష్టమొచ్చినట్లు వాహనాలను ఎక్కడంటే అక్కడ ఆపి సరుకులు పంపిణీ చేస్తుండటంతో చాలామంది కార్డుదారులు సరకులను తీసుకోలేక పోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లటంతో ఇప్పటి వరకు సరకులు తీసుకోని వారి కోసం చౌకదుకాణాల్లో కూడా రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అలాగే సచివా లయాల వద్ద వాహనాలను నిలిపి రేషన్‌ సరకులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి రేషన్‌ సరకులను పట్టణ ప్రాంతాల్లో ఈనెల 18వ తేదీ వరకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే గడువులోపు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కష్టతరంగా మారింది. దీంతో సరకుల పంపిణీ తేదీని నెలాఖరు వరకు పొడిగించారు. ఇక, గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15న రేషన్‌ పంపిణీ ప్రారంభం అయింది. అయితే పల్లెల్లోనూ ఇంటింటికీ సరకుల పంపిణీ సరిగా జరగక పోవటంతో అక్కడ కూడా నెలాఖరు వరకు పొడిగిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్డుదారులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సరుకులు తీసుకోవాలని డీఎస్వో బాలకృష్ణారావు కోరారు.


Updated Date - 2021-02-23T05:44:00+05:30 IST