Abn logo
Oct 22 2021 @ 00:00AM

భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే

కొత్తపల్లి భూ సర్వే పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

సోమందేపల్లి(పెనుకొండ టౌన), అక్టోబరు 22: ఎంతో కాలంగా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్‌  నాగలక్ష్మీ సెల్వరాజ్‌ అన్నారు. శుక్రవారం సోమందేపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భూముల రీసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె భూసర్వే వల్ల జరిగే లాభనష్టాలపై స్థానిక రైతులను  అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతుల అనుమానాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. అలాగే పందిపర్తి, చాలకూరు, గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మిక తనిఖీచేపట్టారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్‌, అటెండెన్స నమోదు చేయాలన్నారు. సచివాలయానికి ఉద్యోగులు, వలంటీర్లు సరిగా హాజరు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని క్రమం తప్పకుండా సచివాలయాలకు హాజరు కావాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ఎనఆర్‌జీఎ్‌స కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ సిరి, సబ్‌ కలెక్టర్‌ నవీన, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డీపీఓ పార్వతి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.