ప్రమోషన్లలో రిజర్వేషన్లతో తీవ్ర నష్టం: శ్రీనివాసులు

ABN , First Publish Date - 2021-12-29T18:39:26+05:30 IST

విద్య, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు వ్యతిరేకం కాదని, .. ప్రమోషన్లలో రిజర్వేషన్ల వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు.

ప్రమోషన్లలో రిజర్వేషన్లతో తీవ్ర నష్టం: శ్రీనివాసులు

కడప: విద్య, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు వ్యతిరేకం కాదని, .. ప్రమోషన్లలో రిజర్వేషన్ల వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని  ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. బుధవారం నగరంలోని మేడా కన్వెన్షన్ హాలులో ఏపీ ఎలక్ట్రిసిటి ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.  యూనియన్‌కు గుర్తింపు ఇచ్చిన దివంగత నేతలు వైఎస్సార్, రోశయ్య చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రమోషన్లకు వ్యతిరేకం కాదు కానీ ప్రమోషన్లలో రిజర్వేషన్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రమోషన్లపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా పాలకులు స్పందించక పోవడం బాధకరమన్నారు. 



కేంద్రం ఓబీసీలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో సజ్జలతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎత్తివేస్తే ప్రతిభ ఉన్న వాళ్లకు న్యాయం జరుగుతుందన్నారు.ప్రమోషన్లలో రిజర్వేషన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఉద్యమ బాట పడుతున్నామని చెప్పారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయకపోతే ఢిల్లీ వేదికగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని శ్రీనివాసులు హెచ్చరించారు.

Updated Date - 2021-12-29T18:39:26+05:30 IST