50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తాం

ABN , First Publish Date - 2022-08-10T06:23:38+05:30 IST

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ యువసేన రాష్ట్ర నాయకులు ప్రకటించారు.

50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తాం

రాజమహేంద్రవరం సిటీ, ఆ గస్టు 9: బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ యువసేన రాష్ట్ర నాయకులు ప్రకటించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో యువసేన రాష్ట్ర అధ్యక్షుడు అను చంద్రప్రసాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బూడిద శరత్‌కుమార్‌, కార్యదర్శి ముద్రగడ పండు, అధికార ప్రతినిధి రాచాబత్తుని నాగార్జున పాల్గొని మాట్లాడారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్‌ పద్ధతి పాటించాలని అన్నారు. అనంతరం బీసీ యువసేన కమిటీని ప్రకటించారు. జిల్లా జాయింట్‌ సెక్రటరిగా రేసు శ్రీనివాస్‌, అధికార ప్రతినిధిగా తాడి సురేష్‌, మహిళా విభాగం జిల్లా మహిళా జాయింట్‌ సెక్రటరీగా టి.పద్మావతి, అల్లూరి జిల్లా సెక్రటరీగా వానపల్లి వెంకటేష్‌, మహిళా అధ్యక్షురాలిగా మార్గాని సుశీల, రాజమహేంద్రవరం రూరల్‌ అధ్యక్షుడిగా సాయి ఆర్కే, జిల్లా మహిళా కార్యదర్శిగా కొల్లేపల్లి సుభాషిణి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా గుబ్బల బాలాను ఎంపిక చేసినట్టు రాష్ట్రాధ్యక్షుడు తెలిపారు. 

Updated Date - 2022-08-10T06:23:38+05:30 IST