Abn logo
Sep 21 2021 @ 01:30AM

రిజర్వేషన్ల ఆవశ్యకతపై పరిశోధనాత్మక గ్రంథం

పుస్తక పరిచయ సభలో పుస్తకాలను ఆవిష్కరిస్తున్న విశ్వజన కళామండలి సభ్యులు

ముమ్మిడివరం, సెప్టెంబరు 20: రిజర్వేషన్ల ఆవశ్యకతను తెలియజేస్తూ పరిశోధనాత్మక గ్రంథాన్ని రచించడం సాహసోపేతమైన చర్య అని ప్రముఖ వాగ్గేయకారుడు, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షుడు మాస్టర్‌జీ అన్నారు. ముమ్మిడివరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కమ్యూనిటీహాలులో విశ్వజనకళామండలి, ప్రజ్ఞాసాహితీ సంయుక్త ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు, ఎస్సీ రిజర్వేషన్లు అనే పరిశోధన గ్రంథ పుస్తక పరిచయసభలో మాస్టర్‌జీ మాట్లాడారు. విశ్వజనకళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తక పరిచయసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాస్టర్‌జీ మాట్లాడుతూ చదవడమే భారంగా భావిస్తున్న ప్రస్తుత రోజుల్లో దళిత క్రైస్తవులు-ఎస్సీ రిజర్వేషన్లు అనే పరిశోధనాత్మక గ్రంథం రచించడం రచయిత జిజ్ఞాసకు అద్దం పడుతోందన్నారు. మరో ముఖ్యఅతిథి దళిత సాహిత్య అకాడమీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు పొనుగుమట్ల విష్ణుమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం చట్టం-1950 జాబితాలో చేర్చిన అంటరాని కులాలవారీ రిజర్వేషన్లు, చట్టపరమైన చిక్కులను దళిత క్రైస్తవులకు అవగాహన కల్పించడమే ఈ పరిశోధనాత్మక గ్రంథ లక్ష్యమన్నారు. అనంతరం పరిశోధనాత్మక గ్రంఽథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత బోయి భీమన్న, తాపీ ధర్మారావు జయంతులను పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుల్లెపు వెంకటేశ్వరరావు, ఎంవీ సూర్జ్యం, బి.శరత్‌, మద్దెల వెంకటేశ్వరరావు, పెయ్యల పరశురాముడు, దోనిపాటి ఆంజనేయులు, జ్యోతిబాబు, పి.శివనాగరాజు, వడ్డి ఏడుకొండలు పాల్గొన్నారు.