ఢిల్లీ: 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. సుప్రీంకోర్టు మహిళా జడ్జిల సదస్సులో సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా కళాశాలల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇది వేలాది ఏళ్లుగా తొక్కివేయబడుతున్న అంశమని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో 30 శాతం కంటే తక్కువ మహిళా జడ్జిలున్నారని తెలిపారు. దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సీజేఐ పేర్కొన్నారు.