రిజర్వేషన్లలో మహిళలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-01-27T06:29:29+05:30 IST

సర్పంచు ఎన్నికల్లో రిజర్వేషన్లల్లో మహిళలే మొదటి స్థానంలో నిలిచారు.

రిజర్వేషన్లలో మహిళలకు ప్రాధాన్యం

కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 26: సర్పంచు ఎన్నికల్లో రిజర్వేషన్లల్లో మహిళలే మొదటి స్థానంలో నిలిచారు. జిల్లాలో సున్నిపెంట మినహా మిగిలిన 970 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడు మహిళల వారిగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ పంచాయతీల్లో మహిళలకు 496, పురుషులకు 476 సర్పంచ్‌ పదవులను రిజర్వు చేశారు. ప్రభుత్వం జిల్లాలోని 20 గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. దీంతో ఆయా గిరిజన పంచాయతీల్లో మహిళలకు 15, పురుషులకు 5 సర్పంచ్‌ స్థానాలు కేటాయించారు. ఇవి గాక మిగిలిన పంచాయతీల్లో ఎస్టీ మహిళకు 15, ఎస్సీ మహిళకు 96, ఎస్సీ జనరల్‌ 95, బీసీ మహిళకు 126, బీసీ జనరల్‌కు 130, అన్‌ రిజర్వుడ్‌ 246, అన్‌ రిజర్వుడ్‌ మహిళకు 244 సర్పంచ్‌ స్థానాలను కేటాయించారు. 


Updated Date - 2021-01-27T06:29:29+05:30 IST