హైదరాబాద్: బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలన్న.. బీసీ సంఘాల డిమాండ్‌ను గౌరవించిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీ 27 మంది బీసీలకు కేబినెట్లో స్థానం కల్పించారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం టాయిలెట్స్ కట్టించిందని కిషన్‌రెడ్డి చెప్పారు.