కరోనా వైరస్‌ను చంపే ఎయిర్‌ ఫిల్టర్ !

ABN , First Publish Date - 2020-07-09T14:00:49+05:30 IST

గాలిలోని కరోనా వైర్‌సను బంధించి, వెంటనే అంతం చేసే వాయు శుద్ధీకరణ పరికరాన్ని(ఎయిర్‌ ఫిల్టర్‌) అమెరికాలోని హూస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.

కరోనా వైరస్‌ను చంపే ఎయిర్‌ ఫిల్టర్ !

అమెరికా పరిశోధకుల రూపకల్పన

హూస్టన్‌, జూలై 8: గాలిలోని కరోనా వైర్‌సను బంధించి, వెంటనే అంతం చేసే వాయు శుద్ధీకరణ పరికరాన్ని(ఎయిర్‌ ఫిల్టర్‌) అమెరికాలోని హూస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘మెటీరియల్స్‌ టుడే ఫిజిక్స్‌’ అనే పత్రికలో ఈ మేరకు వివరాల్ని ప్రచురించారు. మూసేసినట్లుగా ఉండే వాతావరణంలో ఈ పరికరం సాయంతో వైర్‌సను నాశనం చేయవచ్చని పరిశోధకులు అందులో పేర్కొన్నారు.


కరోనా వైరస్‌ 70 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలో బతకని నేపథ్యంలో.. ఫిల్టర్‌ ఉష్ణోగ్రతను 200డిగ్రీల వరకూ పెంచి, వైర్‌సను నాశనం చేసినట్లు వెల్లడించారు. తమ పరిశోధనల సమయంలో, ఈ పరికరం గాలిలో ఉన్న 99.8శాతం కరోనా వైర్‌సను అంతం చేసిందని తెలిపారు. వాణిజ్యపరంగా లభ్యమయ్యే నికెల్‌ ఫోమ్‌ నుంచి తయారు చేసిన ఈ ఫిల్టర్‌ 200డిగ్రీల వేడిలో ఉన్నప్పుడు, ఆంథ్రాక్స్‌ బ్యాక్టీరియాను 99.9శాతం అంతం చేసిందని వారు స్పష్టం చేశారు. దీన్ని పాఠశాలలు, కార్యాలయాల భవనాలు, విమానాశ్రయాలు, విమానాలు తదితర ఎన్నో ప్రదేశాల్లో ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన జీఫెంగ్‌ రెన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-09T14:00:49+05:30 IST