Advertisement
Advertisement
Abn logo
Advertisement

పక్షవాతానికి ఇదీ కారణమే.. 30 వేల మంది బాధితులపై చేసిన సర్వేలో విస్తుపరిచే వాస్తవాలు!

అధిక రక్తపోటు పక్షవాతానికి ప్రధాన కారణమని అందరూ ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు, అయితే ఇటీవలి పరిశోధనల్లో పక్షవాతానికి మరొక కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నూతన పరిశోధనల ప్రకారం తక్కువ రక్తపోటు(లో బ్లడ్ ప్రెజర్) కూడా స్ట్రోక్‌కు కారణమవుతుందని తేలింది. బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డాక్టర్ హ్యూగో జె. అప్రిసియో తన పరిశోధనల ద్వారా దీనిని వెల్లడించారు. ఈ పరిశోధకుడు చేసిన పరిశోధనల ప్రకారం.. లో బ్లడ్ ప్రెజర్‌తో బాధపడుతున్నవారిలో 10 శాతం మందికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. లో బ్లడ్ ప్రెజర్.. స్ట్రోక్ మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పక్షవాతంతో బాధపడుతున్న 30 వేల మందిపై అధ్యయనం చేశారు.

ధూమపానం చేసేవారు, గుండె జబ్బులు ఉన్నవారు లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది. ఇన్నాళ్లూ అనుకుంటున్నట్లు అధిక రక్తపోటు మాత్రమే కాదు, లో బ్లడ్ ప్రెజర్ కూడా కూడా స్ట్రోక్‌కు కారణమవుతుందని పరిశోధనల్లో వెల్లడయ్యింది. స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి లో బ్లడ్ ప్రెజర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లో బ్లడ్ ప్రజెర్ బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు. ఆహారంలో ఉప్పు తగిన మోతాదులో ఉండాలి. శరీరంలో రక్తపోటును సాధారణంగా ఉంచడంలో ఉప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. రోజులో కనీసం 8 గ్లాసుల నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలు తీసుకుని శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు సిగరెట్లు, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు జతచేయాలి. అధిక కార్బోహైడ్రేట్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement