మ్యాన్‌హోల్‌లో ప్రమాదం.. 18 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

ABN , First Publish Date - 2021-08-04T23:08:31+05:30 IST

మ్యాన్‌హోల్‌లో ప్రమాదం.. 18 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

మ్యాన్‌హోల్‌లో ప్రమాదం.. 18 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

హైదరాబాద్: ఎల్బీనగర్ ఆపరేషన్‌కు నీరు ఆటంకంగా నిలుస్తోంది. 18 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ క్రేన్‌తో మట్టిని తవ్వుతున్న నీటి ఊటతో ఇబ్బందిగా మారింది. అధునాతన యంత్రాలతో మృతదేహాన్ని తీసేందుకు డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకూ మృతదేహాన్ని బయటకు తీయకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


హైదరాబాద్‌లో ఇద్దరు ప్రాణాలు తీసిన మ్యాన్‌హోల్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి డ్రైనేజీ క్లీనింగ్‌కు వెళ్లిన శివ, అంతయ్య అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రాత్రి పూట డ్రైనేజీ క్లీన్ చేసేందుకు అనుమతి లేకున్నా కాంట్రాక్టర్ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్ హోల్‌లోకి దిగారు. ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కు‌పోవడంతో కాపాడేందుక వెళ్లి అంతయ్య కూడా ఊబిలో చిక్కుకుని ఊపిరి ఆడక మృతి చెందారు. శివ మృతదేహం లభ్యంకాగా అంతయ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఘటనపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 




Updated Date - 2021-08-04T23:08:31+05:30 IST