భాషా వలంటీర్ల రెన్యువల్‌కు ఎస్‌ఎస్‌ఏ ఏఎంవోకు వినతి

ABN , First Publish Date - 2022-01-25T06:03:51+05:30 IST

ఆదివాసీ భాషా వలంటీర్‌లను రెన్యువల్‌ చేయాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్‌ ఏఎంవో శ్రీనివాసరావుకు గిరిజన సంఘం, భాషా వలంటీర్ల సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు.

భాషా వలంటీర్ల రెన్యువల్‌కు ఎస్‌ఎస్‌ఏ ఏఎంవోకు వినతి
సర్వశిక్షా అభియాన్‌ ఏఎంవోకు వినతిపత్రం అందిస్తున్న భాషా వలంటీర్‌ల సంఘం నాయకులు



పాడేరురూరల్‌, జనవరి 24: ఆదివాసీ భాషా వలంటీర్‌లను రెన్యువల్‌ చేయాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్‌ ఏఎంవో శ్రీనివాసరావుకు గిరిజన సంఘం, భాషా వలంటీర్ల సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు మాట్లాడుతూ..గిరిజన తెగల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మాతృ భాషా విద్యా అభివృద్ధి పథకాన్ని గత ప్రభుత్వాలు అమలు చేశాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విద్యా సంవత్సరం భాషా వలంటీర్‌లను రెన్యువల్‌ చేయకపోవడంతో విశాఖ మన్యంలోని 708 మంది వలంటీర్‌లు రోడ్డున పడ్డారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వలంటీర్‌లను రెన్యువల్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, భాష వలంటీర్ల సంఘం నాయకులు కె.నర్సయ్య, పి.కుమారి, కె.సర్బునాయుడు, పి.శ్రీను, చంద్రయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:03:51+05:30 IST