పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని వినతి

ABN , First Publish Date - 2021-02-27T04:59:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని వినతి

నిజామాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 26 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపైన రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ భారం వేస్తోందని, దీని వల్ల మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మూడు నెలలకాలంలో వంటగ్యాస్‌ ధరలు 200లకుపైగా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సామాన్యులు గ్యాస్‌ను వాడకుండా కట్టెల పొయ్యిల మీదనే వంటలు వండుకునే పరిస్థితులు తీసుకువచ్చేందుకే కేంద్రం కుట్రచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వేస్తున్న పన్నులను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సబ్బాని లత, గంగాధర్‌, రాములు, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T04:59:27+05:30 IST