భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-02T09:00:01+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారిని ఆర్థి కంగా ఆదుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘ ..

భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలి




ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే గోరంట్లకు వినతి


ధవళేశ్వరం/రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 1: కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారిని ఆర్థి కంగా ఆదుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘ రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ నాయకులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరాల నిమిత్తం వాడుకున్న రూ.710 కోట్లు నిధులను భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు జమ చేయాలని పందెళ్ల భానుప్రసాద్‌, శెట్టి చిట్టిబాబు ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ రూరల్‌ సమన్వయకర్త ఆకుల వీర్రాజులను కలిసి వినతిపత్రాలు అంద జేశారు. ప్రభుత్వపరంగా ప్రతీ కార్మికుడికి రూ.10 వేలు సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో పత్తి శ్రీను, ఎస్‌.మురళీకృష్ణ, ఎ.సత్యనారాయణ, జి.చంద్రరావు, గంగరాజు, ఎ.అర్జున్‌, వైఎస్‌ నారాయణ, రామచంద్రరావు, పి.శ్రీను, అర్జునరావు, వెంకటరమణ, వలీ పాల్గొన్నారు. 



రాజమహేంద్రవరం అర్బన్‌: భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు సాయం అందజేయాలని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరంసబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నల్లా రామారావు మాట్లాడుతూ కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.పూర్ణిమరాజు, నాయకులు రాజులోవ, వి.రాంబాబు, శ్రీనివాసు, ఏఐటీ యూసీ నాయకులు రవిచంద్ర, రామకృష్ణ, భద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:00:01+05:30 IST