Abn logo
Jun 16 2021 @ 23:03PM

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

ఎమ్మెల్యేకు వినతిపత్రం అంద జేస్తున్న కూరగాయల వ్యాపారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 16: నార్నూర్‌ మండలంలోని బాబేఝరి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరి ష్కరించాలని బుధవారం ఆసిఫాబా ద్‌లో ఎమ్మెల్యే ఆత్రంసక్కుకు గ్రామ స్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబే ఝరి గ్రామపంచాయతీకి నిధులు మంజూరు చేయాలని సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలను పరి ష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆసిఫాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.

తూముకు మరమ్మతులు చేపట్టాలి..

రెబ్బెన: కుమ్మరికుంట చెరువు తూము లీకేజీ ఏర్పడి నీరువృథాగా పోతోందని వెంటనే మరమ్మ తులు చేపట్టాలని రైతులు బుధవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు తమపొలాల్లో చేరి భూమిలో తుంగపెరిగి సాగుకు అనుకూలంగా లేకుండా పోతోందన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.