ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌కు వినతి

ABN , First Publish Date - 2022-10-03T05:35:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదు ర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడానికి ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ పంపిన ట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌కు వినతి
విలేకరులతో మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు

- ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, అక్టోబరు 2: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదు ర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడానికి ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ పంపిన ట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జులై 2021, జనవరి 2022, జూలై 2022 మూడు డీఏ 9.1 శాతం డీఏలను వెంటనే అమలుచేయాలని సూచించారు. ప్రతీనెల 1వ తేదీన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీతాలు నెల ఆలస్యంగా వస్తున్న కారణంగా ఉద్యోగులు ఇం డ్లు, వాహన, పర్సనల్‌ లోన్ల ఈఎంఐలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ఈఎంఐ ఆర్థిక సంస్థ ల నుంచి సకాలంలో డబ్బులు చెల్లించ లేదనే నోటీసులు ఉ ద్యోగులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతం లో మాదిరిగా సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న డీఏలను అమలుచేయాలన్నా రు. 317 జీవోను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతుల కు ఇబ్బందులులేకుండా ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా చూడాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు దసరా శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు సెగ్గెం రాజేష్‌, శశిభూషన్‌కాచే, తోట్ల తిరుపతియాదవ్‌, పెండ్రు రమ, మద్దెల రాజయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T05:35:00+05:30 IST