Abn logo
Sep 25 2021 @ 00:24AM

రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంకు వినతి

డీఆర్‌ఎంకు వినతితపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

హరిపురం : మందస (హరిపురం) రైల్వే స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఆర్‌ఎం శశికాంత్‌ సింగ్‌కు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ల కన్నారావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. శుక్రవారం వచ్చిన ఆయన్ని కలిసి ఇక్కడి సమస్యలు వివరించారు. డీఎంయూ-2, ప్రశాంతి, విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లుకు హాల్ట్‌లు ఇవ్వాలని, పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్‌ మార్చాలని, డీఎంయూ, ఈఎం యూ ట్రైన్స్‌ పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో బైరిశెట్టి గున్నయ్య, బీజేపీ నాయకులు రౌతు చిరంజీవిరావు, కొంచాడ సురేష్‌, గొలుసు చంద్రశేఖర్‌, బి.ఖగేష్‌ తదితరులు పాల్గొన్నారు.