Abn logo
Mar 3 2021 @ 23:45PM

సీఆర్టీలుగా మార్పు చేయాలని వినతి

గుమ్మలక్ష్మీపురం, మార్చి 3:  తమను కాంట్రాక్టు రెసిడెంట్‌ టీచర్లుగా మార్పు చేయాలని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా    ఉపాధ్యా యులుగా విధులు నిర్వహిస్తున్న తమ సేవలను గుర్తించాలన్నారు.  కేజీబీవీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ల మాదిరిగా సీఆర్‌టీలుగా చేసి జీతాలను పెంచాలని కోరారు. జూన్‌ నుంచి నవంబరు వరకు రావల్సిన ఎరియర్స్‌ను మంజూరు చేయాలన్నారు.  గిరిజన గురుకుల ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం  హామీ ఇచ్చారు. గిరిజన గురుకుల ఔట్‌సోర్సింగ్‌ జిల్లా నాయకులు దివాకర్‌రావు, తిరుపతిరావు, శ్రీధర్‌, వెంకటర మణ, పోలయ్య, హరిబాబు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement
Advertisement