సమస్యలు పరిష్కరించాలని రేషన్‌ డీలర ్ల వినతి

ABN , First Publish Date - 2022-07-05T05:35:50+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాలంటూ జమ్మలమడుగు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు అజయ్‌బాబుకు రేషన్‌డీలర్లు వినతిపత్రం సమర్పించారు.

సమస్యలు పరిష్కరించాలని రేషన్‌ డీలర ్ల వినతి
వినతిపత్రం అందజేస్తున్న రేషన్‌ డీలర్లు

జమ్మలమడుగు రూరల్‌, జూలై 4: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జమ్మలమడుగు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో   డిప్యూటీ తహసీల్దారు అజయ్‌బాబుకు రేషన్‌డీలర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోర్‌ డెలివరీ విధానంతో తమకు ఆదాయ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీయూలకు జీతం, హమాలీ ఖర్చులు, పెట్రోలు ఖర్చులు ఇస్తున్నారని, తాము మాత్రం కమీషన్‌ నుంచే ఖర్చులు భరించాల్సి వస్తోందన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేషన్‌ డీలర్లకు ఒకే విధమైన కమీషన్‌ ఉండాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఒక్కో డీలర్‌కు రూ.440 కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో  రేషన్‌ డీలర్‌ అథెంటికేషన్‌తో మాత్రమే డోర్‌ డెలివరీ ఇవ్వాలని కోరారు. పంచదార, కందిపప్పు వంద శాతం ఇవ్వాలని, ఎలకా్ట్రనిక్‌ కాటాను స్టాంపింగ్‌ ఫీజు నుండి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. పగిలిపోయిన పంచదార, కందిపప్పు ప్యాకెట్లను వాపస్‌ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు  వినతిపత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు మనోహర్‌బాబు, నరసింహులు, తానేషావలి, నాగేశ్వరరెడ్డి, గంగాధర్‌శెట్టి, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయంలో 12 అర్జీలు

 జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 12 వినతిపత్రాలు అందాయి.  మైలవరం మండలం దన్నవాడకు చెందిన 3.55 ఎకరాల ఇనాం  భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు రిజిస్టర్‌ చేయించుకున్నారని తెలిపారు. కొండాపురం మునక గ్రామాలకు సంబంధించిన పలువురు వినతి పత్రాలు సమర్పించారు. సుమారు 12 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో విలేకరులతో మాట్లాడుతూ దన్నవాడకు చెంది న ఇనాం భూమి రిజిస్టరై సుమారు 15 ఏళ్లు కావస్తోందని, దానిపై అదే గ్రామానికి చెందిన సుమారు 30 మంది బాదితులు వినతిపత్రం అందించారని వెంటనే విచారిస్తామని  తెలిపారు. 


Updated Date - 2022-07-05T05:35:50+05:30 IST