విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేడుకోలు

ABN , First Publish Date - 2020-07-03T10:50:01+05:30 IST

ఉపాధిహామీ పథకం కింద పని చేస్తున్న ఫీల్డ్‌ అసి స్టెంట్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని అతిథిగృహం ఆవరణలో గురువారం క్షేత్ర

విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేడుకోలు

మంచిర్యాల టౌన్‌, జూలై 2: ఉపాధిహామీ పథకం కింద పని చేస్తున్న ఫీల్డ్‌ అసి స్టెంట్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని అతిథిగృహం ఆవరణలో గురువారం క్షేత్ర సహాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటం వద్ద మోకాళ్ళపై కూర్చొని వేడుకున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ 2006 నుంచి ఉపాధిహామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 7500 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. 15 సంవత్సరాలుగా ఇదే ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నామని, 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ 4779/2020 వల్ల ఉద్యోగ భద్రత ఉండదని భావించి మార్చిలో సమ్మె బాట పట్టినట్లు తెలిపారు. మంత్రి ఎర్రవెల్లి దయాకర్‌రావు ముఖ్యమంత్రితో మాట్లాడి తమ సమస్యను పరష్కరిస్తారనే నమ్మెకంతో అదే నెల 23న సమ్మె విరమించామని తెలిపారు.


ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెబాట పట్టిన తమను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఉత్త ర్వులు జారీ చేశాయన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లపై జారీ చేసిన తాత్కాలిక సస్పెన్షన్‌ ఉత్తర్వులను ఎత్తివేసి, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు.  అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి రాజేశ్వరి, రాష్ట్ర కమిటీ బాధ్యులు కే సమ్మక్క  వివిధ మండలాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-03T10:50:01+05:30 IST