రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2022-01-27T06:03:43+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష జాతీయ పతాకావిష్కరణ చేశారు.

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌, కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తున్న అదనపు కలెక్టర్ శ్రీహర్ష

- నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

- జాతీయ పతాకావిష్కరణ చేసిన అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, జనవరి 26 : జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలకు అనుగు ణంగా వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, ఆర్డీవో రాములు. ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మన్‌, డీపీఆర్వో చెన్నమ్మ, తహసీల్దార్‌ లక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా పోలీస్‌ కార్యాలయంలో...

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా పోలీసులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి దిశానిర్దేశం చేశారని, రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఒక్కరు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితం నేటి గణతంత్రదినోత్సవమన్నారు. వారిని ఎప్పుడూ స్మరించుకోవాలన్నారు. అనంతరం గత సంవత్సరంలో రాష్ట్రస్ధాయిలో కఠిన సేవా పథకం పొందిన ఏఆర్‌ ఎస్‌ఐ మద్దయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ పోశెట్టి, కానిస్టేబుల్‌ పూజయ్య, రాజు, ఉత్కృష్ట సేవాపథకం పొందిన ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణలకు మెడల్‌ అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియెల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


జిల్లా పౌరసంబంధాల కార్యాలయంలో..

జిల్లా కేంద్రంలోని జిల్లా పౌరసంబంధాల కార్యాలయంలో బుధవారం డీపీఆర్‌వో చెన్నమ్మ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. కార్యక్రమంలో సిబ్బంది షాకీర్‌, జావిద్‌, జిల్లాలోని విలేకరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-27T06:03:43+05:30 IST