మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-01-27T06:23:46+05:30 IST

గణతంత్ర దినోత్సవాన్ని నియోజకవ ర్గంలో బుధవారం ఘనంగా జరుపుకు న్నారు.

మువ్వన్నెల జెండా రెపరెపలు
పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద జెండా వందనం దృశ్యం


పాయకరావుపేట, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని నియోజకవ ర్గంలో బుధవారం ఘనంగా జరుపుకు న్నారు. పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయ ఎదుట కార్యాలయ ఏవో ఎస్‌.లక్ష్మి, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద హెచ్‌డీటీ సుధావాణి, పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ పి.ప్రసాదరావు జెం డాను ఆవిష్కరించారు. ఎంపీపీ ఇసరపు పార్వతితో పాటు పలువురు అధికా రులు, నాయకులు పాల్గొన్నారు. మం గవరం రోడ్డులో కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి జగతా శ్రీను, అలాగే, పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ జెండాను ఎగురవేశారు. ఇదిలావుంటే, కొవిడ్‌ సమయంలో మండలంలో విస్తృత సేవలందించిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను పీహెచ్‌సీ ఆవరణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేశ్‌ సత్క రించారు. వైద్యాధికారి డాక్టర్‌ మురళీకృష్ణారెడ్డితో పాటు 48 మందికి జ్ఞాపికలు అందజేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా నాయకులు ఆర్‌.సత్యనారాయణతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

 నక్కపల్లి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఈవోఆర్‌డీ డి.సీతారామరాజు జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. , రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ వీసం నానాజీ పాల్గొన్నారు.  తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డీటీ శ్రీనివాస్‌, కేజీబీవీలో ఎస్‌వో త్రివేణి,  వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద సీఐ వి.నారాయణరావు జెండాను ఆవిష్కరించారు. నక్కపల్లి గురుకులంలో కూడా ఈ వేడులు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

ఎస్‌.రాయవరం : మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరు పుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ బి.సత్యనారాయణ, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ జెండాను ఎగురవేశారు. అలాగే, వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, పాఠ శాల ల్లోనూ ఈ వేడుకలను నిర్వహిం చారు.

కోటవురట్ల : మండలంలో పలుచోట్ల జాతీయ జెండా రెపరెపలాడింది.  మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో సువర్ణరాజు, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ ప్రసా దరావు, పోలీసు స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ నారాయణరావు జాతీయ జెం డాను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో వైస్‌ ఎంపీపీలు సాగి సీతబాబు, చెక్కా సుజాత తదితరులు పాల్గొన్నారు. అలాగే మిగిలిన ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలల్లోనూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఉత్తములకు పురస్కారాలు

పాయకరావుపేట/నక్కపల్లి/ఎస్‌.రాయవరం  : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలందించిన పలువురు అధికారులను విశాఖలో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ప్రశంసా పత్రాలతో సత్కరించారు. పాయకరావు పేట తహసీల్దార్‌ పి.అంబేడ్కర్‌, ఎస్‌ఐ పి.ప్రసాదరావు, ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ తేజో వెంకటకుమార్‌, పాయకరావుపేట పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రతాప్‌కుమార్‌ సాహు, గోపాలపట్నం సచివాలయ మహిళా పోలీస్‌ భవానీ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే, నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్‌సీ పరిధిలో (104 వాహనం) మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యజ్జల తులసీనవీనకు, ఎస్‌.రాయవరం మండలం వెలుగు ఏపీఎం ఎస్‌.శ్రీనివాసరావుకు కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు.

Updated Date - 2022-01-27T06:23:46+05:30 IST